• Login / Register
  • TGSRTC | ఏసీ బస్సుల్లో 10 శాతం రాయితి

    TGSRTC | ఏసీ బస్సుల్లో 10 శాతం రాయితి
    మెట్రో ఎక్స్ ప్రెస్ బస్ పాస్ దారుల‌కు వ‌ర్తింపు
    ల‌హ‌రి, రాజ‌ధాని, గ‌రుడ‌ప్ల‌స్‌, ఈ-గ‌రుడ‌, ఏసీ స‌ర్వీసుల్లో వ‌ర్తింపు
    తెలంగాణ ఆర్టీసీ సీఎండి స‌జ్జ‌నార్ వెల్ల‌డి

    Hyderabad : ఆర్‌టీసీ ప్ర‌యాణికుల‌కు ఆర్టీసీ యాజ‌మాన్యం శుభ‌వార్త చెప్పింది. ముఖ్యంగా హైదరాబాద్ లోని మెట్రో ఎక్స్ ప్రెస్ బస్ పాస్ దారులకు ప్ర‌యోజ‌నం క‌లిగే విధంగా నిర్ణ‌యం తీసుకుంది. న‌గ‌ర ప్ర‌యాణికుల వ‌ద్ద ఉన్న మెట్రో ఎక్స్ ప్రెస్ పాసుతో లహరి, రాజధాని, గరుడ ప్లస్, ఈ-గరుడ, తదితర ఏసీ సర్వీసుల్లో ప్రయాణించిన వారికి టికెట్ లో 10 శాతం రాయితి ఇవ్వాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు టీజీఎస్ ఆర్‌టీసీ సీఎండి వీసీ స‌జ్జ‌నార్ సోమ‌వారం ప్ర‌క‌టించారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్లే అన్ని TGSRTC ఏసీ బస్సుల్లో ఈ 10 శాతం డిస్కౌంట్ వర్తిస్తుంది. అలాగే మెట్రో ఎక్స్ ప్రెస్ తో పాటు మెట్రో డీలక్స్, గ్రీన్ మెట్రో, ఎయిర్ పోర్ట్ పుష్ఫక్ బస్ పాస్ దారులు కూడా ఈ రాయితీని పొందవచ్చ‌ని, వచ్చే ఏడాది జనవరి 31 వరకు 10 శాతం రాయితి అమల్లోకి వ‌స్తుంద‌ని సీఎండి వెల్ల‌డించారు. 
    "హైదరాబాద్ లో ప్ర‌స్తుతం 70 వేల వరకు మెట్రో ఎక్స్ ప్రెస్ బస్ పాసులున్నాయి. వారిలో ఎక్కువగా వారాంతం సెల‌వుల‌కు సొంతూళ్లకు వెళ్లి వ‌స్తుంటారు. ఈ నేపథ్యంలోనే బస్ పాసుదారుల సౌకర్యార్థం ఏసీ సర్వీసుల్లో 10 శాతం రాయితీని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. అయితే ఆర్టీసీ అధికారిక వెబ్ సైట్ tgsrtcbus.in లో ముందస్తు రిజర్వేషన్ చేసుకుని రాయితీని పొందే సౌక‌ర్యం క‌ల్పించారు. జనరల్ బస్ పాస్ దారులు 10 శాతం డిస్కౌంట్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాం." అని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు.
    *  *  * 

    Leave A Comment